యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ధమాకా ఆఫర్‌..! ఆ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేస్తే ఎక్స్‌ట్రా డేటా..!

యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ధమాకా ఆఫర్‌..! ఆ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేస్తే ఎక్స్‌ట్రా డేటా..!

ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ వినియోగదారులకు దీపావళి సందర్భంగా ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.251, రూ.299, రూ.398 రీఛార్జ్‌ ప్లాన్లపై అదనంగా డేటాను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ పోర్టల్‌లో రీఛార్జి చేస్తే మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రూ.251 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా అదనంగా లభిస్తుందని తెలిపింది. ఈ ప్లాన్‌లో మొత్తం 70 జీబీ డేటా యూజర్లకు రానున్నది. ఇక ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది.


ఇక రూ.299 ప్లాన్‌పై సైతం అదనంగా 3 జీబీ డేటా అందిస్తున్నది. ఈ ప్లాన్‌ వ్యాలిడీ సైతం 30 రోజులు ఉండనున్నది. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్‌తో పాటు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు సైతం లభించనున్నాయి. రూ.398 ప్లాన్‌లో రీఛార్జ్‌ సైతం 120 జీబీ డేటా రానుండగా.. ఎక్స్‌ట్రా 3 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభించనున్నాయి. ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది.


అయితే, ఈ ప్లాన్స్‌ అన్నీ ఈ ప్లాన్‌ను సైతం సెల్ఫ్‌కేర్‌ యాప్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ అందుబాటులో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. గత సంవత్సరం భారతీయ టెలికాం కంపెనీ భారత్‌లో రెండు కొత్త ప్రీపేయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. అవి కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇందులో రూ.1,198 ఖరీదైన ప్లాన్‌ కాగా.. వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్‌ కావాలనుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో నెలకు 3 జీబీ డేటాతో పాటు 300 నిమిషాల కాలింగ్‌, 30 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.


ఇక రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. అయితే ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ ఉంటుంది. 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే, డేటా మాత్రం అందుబాటులో ఉండదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.398 ప్లాన్‌ను సైతం ఆఫర్‌ చేస్తున్నది. ఇందులో అన్‌లిమిటెడ్‌ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు రానుండగా.. వ్యాలిడిటీ నెల రోజులు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర టెలికాం కంపెనీలకు చెందిన ప్లాన్స్‌తో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌ తక్కువగా ఉన్నాయి.