మోడీవి చేతగాని ఒంటె అరుపులు..చైనా 4042 చ.కి. ఆక్రమించింది: సుబ్రమణ్యస్వామి
మాల్దీవులు చైనా నౌకాదళ ఓడను తన తీరంలో లంగరు వేయడానికి అనుమతించింది. ఇది భారతదేశానికి అవమానకరం. చైనా 2020 నుంచి లడక్‌లో 4042 చదరపు కిలోమీటర్ల

విధాత: మాల్దీవులు చైనా నౌకాదళ ఓడను తన తీరంలో లంగరు వేయడానికి అనుమతించింది. ఇది భారతదేశానికి అవమానకరం. చైనా 2020 నుంచి లడక్‌లో 4042 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మోడీ చేతగాని ఒంటె అరుపులు అరుస్తున్నారు. కోయీ ఆయా నహీ అని చెబుతున్నారు. మోడీకి మార్గదర్శన్ మండలిలో చేరే సమయం వచ్చింది అని బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి బుధవారం తన ఎక్స్ ఖాతాలో అభిప్రాయపడ్డారు.
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ చైనా దురాక్రమణ వంటి అంశాలపై మోడీ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తారని ఆశించకండి. పుతిన్ ట్రంప్ను వ్యక్తిగత అంశాలను అడ్డంపెట్టి బ్లాక్‌మెయిల్ చేశారు. పుతిన్ స్వయంగా చైనా ఆర్థిక విధానాల్లో జూనియర్ భాగస్వామి. మోడీని కార్నర్ చేస్తారు. భారత దేశం నష్టపోతుంది అని మరో అభిప్రాయాన్ని కూడా ఆయన ఎక్స్‌లో వ్యక్తం చేశారు