Diesel Paratha | పరాటాలందు డీజిల్‌ పరాటావేరయా..! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..

Diesel Paratha | పరాటాలు ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌.. రాత్రిళ్లు భోజనంలోనూ తీసుకుంటారు. మరికొందరు మధ్యాహ్నం సమయంలనూ పరాటాలను ఇష్టపడి మరీ తింటుంటారు. రుచిగా ఉండడంతో ఎంతో ఇష్టంగా తీఉకుంటారు. ఈ పరాటాలను బట్టర్‌, నెయ్యి, నూనెతో కాల్చి చేస్తుంటారు. పరాటాల్లో ముఖ్యంగా ఆలు పరాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ, సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి చేసిన డీజిల్ పరాటా వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. మరి ఆ డీజిల్‌ పరాటా కథ ఏంటో తెలుసుకుందాం.

వీడియో ప్రకారం దాబాలో పని చేస్టే మాస్టర్‌ మొదట పిండిని పిసికి రొట్టెను చేశాడు. అందులోనే ఉడకబెట్టిన ఆలుగడ్డలను మిక్స్‌ని వేశాడు. ఆ తర్వాత మెల్లగా ఒత్తుతూ ఆలూ పరాటా తయారు చేశాడు. దాన్ని పెనంపై వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ఇక చివరగా కాలుతున్న పరాటాపై ‘డీజిల్‌’ని పోశాడు. డీజిల్ మిక్స్ అని చెబుతూ పరాటాను మొత్తం డీజిల్‌లోనే ముంచేశాడు. అందులోనే ఆ పరాటాను బాగా కాల్చాడు. నెబ్యులా వరల్డ్ అనే ‘ఎక్స్’ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. నాలుగు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే, ఈ వీడియోను చూసిన పలువురు భిన్నంగా స్పందించారు.

ఇలాంటి పరాటాలు తింటే క్యాన్సర్‌ రావడం ఖాయమని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలాంటివి దారుణమని.. ఇలాంటివి చేస్తే అధికారులు పట్టించుకోరా? అంటూ మరికొందరు స్పందించారు. అయితే, డీజిల్, పెట్రోల్ ఏదీ కాదని.. ఇప్పటికే వాడిన నూనెనే అలా అయి ఉంటుందని పేర్కొంటున్నారు. డీజిల్‌ కాకపోయినా.. అలాంటి నూనె వాడిన ఎంతో ప్రమాదకరమని మరికొందరు కామెంట్ చేశారు. మరో యూజర్‌ ప్రొటీన్‌, గుడ్ల కంటే ఇదే బెటర్‌ అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. భవన్‌ చంద్‌ అనే ఫ్యాట్‌ లాస్‌ కోచ్‌ స్పందిస్తూ.. అనారోగ్యకరమైన ఆయిల్స్‌ జాబితాలో పెట్రోల్‌, డీజిల్‌, సీడ్‌ ఆయిల్స్‌ను చేరుస్తున్నటుగా కామెంట్‌ చేశాడు. అయితే, ఈ వీడియో చండీగఢ్‌కు చెందినదిగా తెలుస్తున్నది. ఈ వీడియోను పలువురు ఫుడ్‌ సెక్యూరిటీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్ ఇండియాకు సైతం ట్యాగ్‌ చేశారు.