ఉత్త‌ర కాశీలో స్వ‌ల్ప భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో న‌మోదు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో గురువారం తెల్లవారుజామున స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌ఫై 3.1గా న‌మోదైన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది

ఉత్త‌ర కాశీలో స్వ‌ల్ప భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో న‌మోదు
  • ప‌క్షం రోజుల్లో ఇది మూడోసారి భూకంపం



విధాత‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో గురువారం తెల్లవారుజామున స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌ఫై 3.1గా న‌మోదైన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రాష్ట్ర రాజ‌ధాని నగరమైన డెహ్రాడూన్ నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో భూమి ఉప‌రిత‌లంపై ఐదు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి భ‌యాందోళ‌న‌ల‌తో బ‌య‌ట‌కు పరుగులు తీశారు.


ఉత్తరకాశీలో గ‌డిచిన ప‌క్షంలో భూకంపం రావడం ఇది మూడో సారి. ఈ నెల మూడో తేదీన‌ అర్ధరాత్రి వేళ‌ భూ ప్రకంపణలు వచ్చాయి. అప్పుడు భూకంప కేంద్రం నేపాల్‌లో న‌మోదైంది. ఈ నెల ఐదో తేదీన‌3.2 తీవ్రత‌తో భూమి కంపించింది. యమునా నది లోయ ప్రాంతాల్లో ప్రకంపణలు ఎక్కువగా వచ్చాయి.