ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో విషాదం.. విష వాయువు పీల్చ‌డంతో ఐదుగురు మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో విషాదం నెల‌కొంది. విష వాయువులు పీల్చ‌డంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మొత్తం ఐదుగురు మృతి చెందారు.

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో విషాదం.. విష వాయువు పీల్చ‌డంతో ఐదుగురు మృతి

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో విషాదం నెల‌కొంది. విష వాయువులు పీల్చ‌డంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మొత్తం ఐదుగురు మృతి చెందారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. చంపా జిల్లా కికిర్దా గ్రామంలో ఉన్న ఓ బావిలో ఒక చెక్క ప‌డింది. దాన్ని బావిలో నుంచి తీసేందుకు రామ‌చంద్ర జైశ్వాల్ అనే వ్య‌క్తి లోప‌లికి దిగాడు. బావిలోనే అత‌ను స్పృహ కోల్పోవ‌డంతో బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు స‌హాయం చేయాల‌ని గ్రామ‌స్తుల‌ను కోరారు.

దీంతో మ‌రో ముగ్గురు వ్య‌క్తులు క‌లిసి రామ‌చంద్ర జైశ్వాల్‌ను బావిలో నుంచి బ‌య‌ట‌కు తీసేందుకు లోప‌లికి దిగారు. ఆ ముగ్గురు కూడా బావిలోనే స్పృహ కోల్పోయారు. వీరిని ర‌క్షించేందుకు మ‌రో వ్య‌క్తి కూడా బావిలోకి దిగ‌గా అత‌ను కూడా ప్రాణాలొదిలాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు కికిర్దా గ్రామానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. బావిలో ఉన్న విష వాయువుల‌ను పీల్చ‌డం వ‌ల్లే ఆ ఐదుగురు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచిన‌ట్లు నిర్ధారించారు. ఐదుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మృతుల‌ను రామ‌చంద్ర జైశ్వాల్, ర‌మేశ్ ప‌టేల్, రాజేంద్ర ప‌టేల్, జితేంద్ర ప‌టేల్, తికేశ్వ‌ర్ చంద్ర‌గా పోలీసులు గుర్తించారు.