Road Accident | లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి.. 64మందికిపైగా గాయాలు

Road Accident | గుజరాత్‌ డాంగ్‌ జిల్లాలు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో 64 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అహ్వా, నపుతారా ఆసుపత్రులకు తరలించారు.

Road Accident | లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి.. 64మందికిపైగా గాయాలు

Road Accident | గుజరాత్‌ డాంగ్‌ జిల్లాలు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో 64 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అహ్వా, నపుతారా ఆసుపత్రులకు తరలించారు. సూరత్‌లోని సపుతర నుంచి తిరిగి వస్తుండగా ఖీన్‌లో ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది. ఓ వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేస్తున్న సమయలో బస్సు హైవేపై రక్షణ గోడను ఢీకొట్టిన లోయలోకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. లగ్జరీ బస్సు సూరత్‌ నుంచి సపుతారా నుంచి తిరిగి పర్యాటకులతో వస్తున్నదని పేర్కొన్నారు.

ముగ్గురు ప్రయాణీకులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. గాయపడ్డ మిగతా వ్యక్తులను కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. యూపీలోని ముజఫర్‌నగర్‌లో రెండు బస్సులు అదుపుతప్పి బోల్తాపడ్డాయి. ఆయా ఘటనల్లో ఒకరు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే భగెన్లా చెక్‌పోస్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారి తెలిపారు. మృతుడు బస్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారని సర్కిల్‌ ఆఫీసర్‌ రూపాలిరావు తెలిపారు. ఈ-రిక్షాను తప్పించేందుకు డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగింది. అలాగే, మరో బస్‌ డ్రైవర్‌ సైతం బ్రేకులు వేసేందుకు ప్రయత్నించగా రెండు నియంత్రణ కోల్పోయి బోల్తాపడ్డాయి.