ప్రకృతి సోయగాల కేరళ అందాలను చూసోద్దామా..? పర్యాటకులకు బంపర్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌ కేరళ. అక్కడి అందాలను చేసుకుందుకు వెళ్లాలని భావిస్తున్నారా..? అలా అనుకుంటే మీ కోసమే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.

ప్రకృతి సోయగాల కేరళ అందాలను చూసోద్దామా..? పర్యాటకులకు బంపర్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

విధాత‌: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌ కేరళ. అక్కడి అందాలను చేసుకుందుకు వెళ్లాలని భావిస్తున్నారా..? అలా అనుకుంటే మీ కోసమే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి ఈ ప్యాకేజీ టూర్‌ మొదలవనున్నది. కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్‌ పేరుతో ప్యాకేజీని ప్రారంభించింది. ఈ టూర్‌లో ఐదు రాత్రులు, ఆ రోజుల పాటు కొనసాగుతుంది. టూర్‌ ప్యాకేజీ ప్రస్తుతం ఈ నెల 21, 28 తేదీల్లో అందుబాటుఓ ఉన్నది. టూర్‌లో మున్నార్‌, అలెప్పీ తదితర పర్యాటక ప్రాంతాలు కవర్‌ అవుతాయి.


ప్రయాణం ఇలా..


తొలిరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలవుతున్నది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది. రెండోరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్‌కు బయలుదేరాల్సి ఉంటుంది. మున్నార్‌ చేరుకున్న తర్వాత సాయంత్రం మున్నార్‌ టౌన్‌ పర్యటనకు వెళ్తారు. మూడోరోజు ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, ఎకో పాయింట్‌ సందర్శిస్తారు.


అదే రాత్రి అక్కడే బస ఉంటుంది. నాలుగో రోజు అలెప్పీకి బయలుదేరి వెళ్తారు. హోటల్‌కు చేరుకున్న తర్వాత బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలోనే బస ఉంటుంది. ఐదోరోజు హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసి ఎర్నాకులం చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు మళ్లీ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ట్రైన్‌ సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.


ప్యాకేజీ ఇలా..


కేరళ పర్యటనకు సంబంధించి పలు రకాల ప్యాకేజీలను అందిస్తున్నది. కంఫర్ట్‌ క్లాస్‌, స్టాండర్డ్‌ క్లాస్‌ అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ. 33,480 ధర నిర్ణయించింది. డబుల్‌ షేరింగ్‌కు రూ.19,370 ధర నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,580 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది.


స్టాండర్డ్‌ కేటగిరిలో స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. సింగిల్‌ షేరింగ్‌కు రూ.30,770 చెల్లించాల్సి ఉంటుంది. ట్విన్‌ షేరింగ్‌కు రూ.16,600, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.12,800 చెల్లించాల్సి ఉంటుంది. రెండు కేటగిరిల్లో 5-11 సంవత్సరాల పిల్లలకు సైతం ప్రత్యేకంగా ఛార్జీలను సైతం నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.