CM Siddaramaiah : సీఎం సిద్దరామయ్య కారుకు చలానాలు..50శాతం రాయితీతో చెల్లింపు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కారుపై ఏడుచోట్ల ట్రాఫిక్ చలానాలు ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన 50% రాయితీతో రూ.8750 చెల్లించి క్లియర్ చేశారు.

విధాత: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి సామాన్యుల నుంచి సీఎంల వరకు జరిమాన చలానాలు చెల్లించక తప్పదనడానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah) కారు చలాన్ల ఘటన నిదర్శనంగా నిలిచింది. సీఎం సిద్దరామయ్య కారుపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఏడు చలాన్లు ఉన్నాయి. అతివేగంపై ఒకసారి, సీటు బెల్టు ధరించలేదని ఆరుసార్లు చలానా విధించారు. ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లు ఇటీవల సీఎం కారుకు చలాన్ల చెల్లింపు ఉండదా అంటూ ఓ ఆట ఆడుకున్నారు.
ఇటీవల ఆగస్టు 21న ట్రాఫిక్ చలానా చెల్లింపుల కోసం వాహనదారులకు కర్ణాటక(KArnataka) ప్రభుత్వం 50శాతం రాయితీ స్కీమ్ ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం కారు చలాన్లపై రేగిన రచ్చతో సీఎంవో అధికారులు కూడా సీఎం కారు చలాన్లను రాయితీ పథకం కింద రూ. 8750 చెల్లించి క్లియర్ చేశారు. సెప్టెంబరు 19వ వరకు అమల్లో ఉండనున్న ట్రాఫిక్ చలాన్ల 50శాతం పథకం కింద రూ.40కోట్లు వసూలైనట్లు అక్కడి రవాణా శాఖ అధికారులు తెలిపారు.