గ‌ట్టిగా గాలి పీల్చేస‌రికి.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన ముక్కుపుల్ల..

ఓ మ‌హిళ గట్టిగా గాలి పీల్చేస‌రికి త‌న ముక్కు పిల్ల వెనుకాల ఉండే గొట్టం ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఆమె రెండు నెల‌ల‌ పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది.

గ‌ట్టిగా గాలి పీల్చేస‌రికి.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన ముక్కుపుల్ల..

కోల్‌క‌తా : ఓ మ‌హిళ గట్టిగా గాలి పీల్చేస‌రికి త‌న ముక్కు పిల్ల వెనుకాల ఉండే గొట్టం ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఆమె రెండు నెల‌ల‌ పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. చివ‌ర‌కు వైద్యులు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, ఆ గొట్టాన్ని బ‌య‌ట‌కు తీశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాకు చెందిన వ‌ర్ష సాహు(35) అనే మ‌హిళ త‌న ముక్కుకు పెళ్లైన కొత్త‌లో ఓ ముక్కు పుల్ల ధ‌రించింది. అంటే ఆమె పెళ్లై దాదాపు 16 ఏండ్లు అవుతుంది. అయితే ఆ ముక్కు పుల్ల గొట్టం వ‌దులుగా ఉన్న‌ట్టుంది. రెండు నెల‌ల‌ క్రితం ఆమె గాలిని గ‌ట్టిగా పీల్చేస‌రికి ఆ ముక్కు పుల్ల నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్ర‌వేశించింది.

అయితే ఆ గొట్టం క‌డుపులోకి వెళ్లి ఉండొచ్చ‌ని వ‌ర్ష భావించింది. మ‌ల‌విస‌ర్జ‌న ద్వారా బ‌య‌ట‌కు వ‌స్త‌దేమో అనుకుంది. కానీ ఈ లోపు ఆమెకు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఏర్ప‌డింది. న్యూమోనియా కూడా అటాక్ అయింది. ద‌గ్గు కూడా తీవ్ర‌మైంది. చివ‌ర‌కు ప‌ల్మ‌నాల‌జిస్ట్‌ను వ‌ర్షం సంప్ర‌దించింది. సీటీ స్కాన్, ఎక్స్‌రే నిర్వ‌హించ‌గా, ఆమె ఊపిరితిత్తుల్లో ఉన్న ముక్కు పుల్ల గొట్టాన్ని గుర్తించారు. ఆమె ఊపిరితిత్తుల‌కు ఎలాంటి ప్ర‌మాదం క‌ల‌గ‌కుండా అధునాత‌న శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించి, ఆ గొట్టాన్ని బ‌య‌ట‌కు తీశారు. రెండు వారాల క్రితం స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని, బాధితురాలు వ‌ర్ష ఆరోగ్యంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

వ‌ర్ష వయసులో ఉన్న మహిళల్లో ఇలాంటి కేసలు త‌క్కువ‌గా జ‌రుగుతాయ‌ని వైద్యులు పేర్కొన్నారు. సాదార‌ణంగా వృద్ధులు, పిల్ల‌ల్లో ఇలాంటి కేసులు సంభ‌విస్తాయ‌న్నారు. గ‌త ద‌శాబ్ద కాలంలో ఇలాంటి కేసులు రెండు మాత్ర‌మే చోటు చేసుకున్నాయ‌ని డాక్ట‌ర్లు పేర్కొన్నారు.