ఎండ‌ల‌ను జ‌యించ‌డం ఎలా..? ఈ యువ‌కుడిని చూసి నేర్చుకోవాలి..! వీడియో

దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్దామంటే వ‌డ‌గాలులు, ఇంట్లోనే ఉందామంటే ఉక్క‌పోత‌. ఈ రెండింటిని భ‌రించ‌లేక‌పోతున్నారు జ‌నాలు. వ‌డ‌గాలులు, ఉక్క‌పోత నుంచి ఎలా ఉప‌శ‌మ‌నం పొందాలో తెలియ‌డం లేదు. భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో చ‌ల్ల‌ద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు జ‌నాలు.

ఎండ‌ల‌ను జ‌యించ‌డం ఎలా..? ఈ యువ‌కుడిని చూసి నేర్చుకోవాలి..! వీడియో

దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్దామంటే వ‌డ‌గాలులు, ఇంట్లోనే ఉందామంటే ఉక్క‌పోత‌. ఈ రెండింటిని భ‌రించ‌లేక‌పోతున్నారు జ‌నాలు. వ‌డ‌గాలులు, ఉక్క‌పోత నుంచి ఎలా ఉప‌శ‌మ‌నం పొందాలో తెలియ‌డం లేదు. భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో చ‌ల్ల‌ద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు జ‌నాలు. ఫ్యాన్ గాలి దేనికి స‌రిపోవ‌డం లేదు. కూల‌ర్లు కూడా కొనే ప‌రిస్థితి లేదు. ఏసీ కొనేంత స్థోమ‌త కూడా లేదు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు. ఇలాంటి వారు ఇన్నోవేటివ్ థాట్స్‌కు ప‌దును పెడుతున్నారు.

ఓ యువ‌కుడు చేసిన వినూత్న ప్ర‌యోగం నెట్టింట వైర‌ల్ అవుతోంది. అత‌ను నివాసం ఉంటున్న‌ది రేకుల ఇంట్లో. ఎండాకాలం కావ‌డంతో ఉక్క‌పోత మ‌రింత ఎక్కువైంది. ఫ్యాన్ ఉన్నా లాభం లేదు. దీంతో ఓ ఓపెన్ కూల‌ర్ తీసుకొచ్చాడు. ఆ కూల‌ర్ నుంచి చ‌ల్ల గాలి రావ‌డం లేదు. ఇక ఇంట్లో ఉన్న ఫ్రిజ్ డోర్ తెరిచాడు. ఆ ఫ్రిజ్ ముందు ఈ ఓపెన్ కూల‌ర్ పెట్టి ఆన్ చేశాడు. ఫ్రిజ్‌లో నుంచి వ‌స్తున్న చ‌ల్ల‌ని గాలి.. కూల‌ర్‌లోకి ప్ర‌వేశించడంతో ఆ ఇల్లంతా కాస్త చ‌ల్ల‌గా మారింది. ఆ కూల‌ర్ ముందు హాయిగా అత‌ను నిద్రిస్తున్నాడు.

ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఆ యువ‌కుడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇన్నోవేటివ్ థాట్ అంటూ కితాబిస్తున్నారు. పేదోడి ఏసీ అని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. మే 2వ తేదీన ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా.. ల‌క్ష‌లాది మంది లైక్ చేశారు.