Alok Kumar Jha | రికార్డు సృష్టించిన రైల్వే టికెట్ ఎగ్జామినర్.. ఒకే రోజు రూ. 1.72 లక్షలు వసూలు చేశాడు..
Alok Kumar Jha | మీరు చాలా మంది రైళ్లల్లో( Trains ) ప్రయాణించే ఉంటారు.. ఇక టికెట్ లేకుండా ప్రయాణించే వారిని కూడా చూసి ఉంటారు. ఇలా ప్రయాణించే వారి నుంచి టికెట్ ఎగ్జామినర్లు( Ticket Examiner ) జరిమానాలు విధించి డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే ఓ టికెట్ ఎగ్జామినర్.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి ఒకే రోజు లక్షల రూపాయాలు వసూలు చేసి చరిత్ర సృష్టించాడు.

Alok Kumar Jha | రైల్వే( Railway )లో పని చేసే ఓ టికెట్ ఎగ్జామినర్( Ticket Examiner ) రికార్డు సృష్టించాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. వారి నుంచి జరిమానాలు ముక్కుపిండి వసూలు చేశాడు. అదేదో వందలు, వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో వసూలు చేశాడు. ఒకే రోజు రూ. 1.72 లక్షలు వసూలు చేసి రైల్వే చరిత్రలోనే రికార్డు సృష్టించాడు ఆ టికెట్ ఎగ్జామినర్.
మహారాష్ట్ర( Maharashtra )లోని నాగపూర్ డివిజన్( Nagpur Division )లో అలోక్ కుమార్ ఝా( Alok Kumar Jha ) అనే వ్యక్తి హెడ్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల దనపూర్ రైల్వే స్టేషన్( Danapur railway station ) – ఎస్ఎంవీటీ బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రైలులో అలోక్ కుమార్ ప్రయాణికుల టికెట్లను చెక్ చేశారు. ఈ క్రమంలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకున్నాడు. 220 మందికి జరిమానాలు విధించి రూ. 1.72 లక్షలు వసూలు చేశాడు. ఇదంతా ఒక్క రోజులోనే. ఈ విషయాన్ని నాగపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారికంగా ప్రకటించారు. ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన అలోక్ కుమార్ ఝాపై ప్రశంసల వర్షం కురిపించారు.
అలోక్ కుమార్ ఝాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి టికెట్ ఎగ్జామినర్లు రైల్వేకు ఎంతో అవసరమని అంటున్నారు. నిజాయితీగా పని చేసే ఇలాంటి ఉద్యోగుల వల్ల రైల్వేస్ కు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు.
Shri Alok Kumar Jha, Head Ticket Examiner, Nagpur, set a new record in single-day revenue by recovering ₹1.72 lakh from 220 irregular passengers on Train 03251. His vigilance and dedication underscore the vital role of TEs in ensuring compliance and boosting revenue. pic.twitter.com/qh3WOtWV0v
— DRM Nagpur , CR (@drmcrngp) June 27, 2025