బయట పేపర్ లీక్‌,లోపల వాటర్ లీక్‌ .. పార్లమెంటు నూతన భవనం లీకేజీలపై కాంగ్రెస్ ట్వీట్‌

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు పార్లమెంటు నూతన భవనం సైతం చుట్టు కూడా వరద నీరు చేరింది.

బయట పేపర్ లీక్‌,లోపల వాటర్ లీక్‌ .. పార్లమెంటు నూతన భవనం లీకేజీలపై కాంగ్రెస్ ట్వీట్‌

విధాత, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు పార్లమెంటు నూతన భవనం సైతం చుట్టు కూడా వరద నీరు చేరింది. పార్లమెంటు భవనం లాబీలో వాటర్ లీకేజీ అవుతుండగా, ఈ దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్విటర్‌లో పోస్టు చేసి బయట(నీట్ ప్రశ్నపత్రం) పేపర్ లీక్‌..లోపల వాటర్ లీక్ అంటూ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలోని నాణ్యతలేమి సమస్యలను ఇది వెల్లడి చేస్తోందని, దీనిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతానిని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నూతన భవనాన్ని గతేడాది మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తలిసింది. ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్‌ 19న ఈ భవనంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించారు. ఇక కొత్త భవనం ప్రారంభించిన ఏడాదికే లీకేజీలు బయటపడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.