పార్టీతో అభిప్రాయ భేదాలు అంగీకరించిన శశి థరూర్‌

పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ చెప్పారు. పార్టీ నుంచి తనను ఎవరైనా సంప్రదిస్తే వాటిపై ఆంతరంగికంగానే చర్చిస్తానని స్పష్టం చేశారు

పార్టీతో అభిప్రాయ భేదాలు అంగీకరించిన శశి థరూర్‌

పార్టీతో అభిప్రాయ భేదాలు
అంగీకరించిన శశి థరూర్‌
పార్టీలోపలే చర్చిస్తానని వెల్లడి
తిరువనంతపురం : పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ చెప్పారు. పార్టీ నుంచి తనను ఎవరైనా సంప్రదిస్తే వాటిపై ఆంతరంగికంగానే చర్చిస్తానని స్పష్టం చేశారు. ‘పదహారేళ్లుగా నేను పార్టీలో పనిచేస్తున్నా.. కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. వాటిని పార్టీలోపలే చర్చిస్తాను. బయట మాట్లాడను’ అని అన్నారు. పార్టీలో చర్చించడానికి సమయం రావాలన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సహా పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా థరూర్‌ మాట్లాడటం కొంత కలకలం రేపింది. కొందరు కాంగ్రెస్‌ నాయకులు సైతం బాహాటంగానే ఆయన వైఖరిని తప్పపట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నాయా అని విలేకరులు శశిథరూర్‌ని ప్రశ్నించారు. ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటింగ్ కొనసాగుతున్నందున ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదని థరూర్‌ బదులిచ్చారు. ‘పోలింగ్ కొనసాగుతున్నందున ఆ సమస్యల గురించి (నాయకత్వంతో ఆయనకున్న విభేదాలు) మాట్లాడటానికి ఇది సమయం కాదు, అక్కడ నా స్నేహితుడు (కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్) గెలవాలని కోరుకుంటున్నాను.’ అని శశిథరూర్ స్పష్టం చేశారు.