Viral Video | కొత్త పెళ్లాంతో స‌ర‌సాలు.. పాత పెళ్లాంతో చెప్పు దెబ్బ‌లు.. వీడియో

Viral Video | మ‌గాళ్ల‌కు మ‌హిళ‌లంటే( Woman ) మోజు అయిపోయింది. ఒక ఆట‌బొమ్మ‌గానే మ‌హిళ‌ను చూస్తున్నారు. పెళ్లాయ్యాక( Marriage ) కూడా పెళ్లాన్ని వ‌దిలేసి.. ప‌రాయి స్త్రీ మోజులో ప‌డి సంసారాన్ని మంట‌గ‌లుపుతున్నారు. అలాంటి ఓ మ‌గాడు.. కొత్త పెళ్లాం( Wife )తో స‌రసాలు చేస్తూ.. పాత పెళ్లాంతో చెప్పు దెబ్బ‌లు తిన్నాడు.

Viral Video | కొత్త పెళ్లాంతో స‌ర‌సాలు.. పాత పెళ్లాంతో చెప్పు దెబ్బ‌లు.. వీడియో

Viral Video | పెళ్లంటే( Marriage ) నూరేళ్ల పంట అని అంటారు. అంటే పంచ‌భూతాల సాక్షిగా మ‌నువాడుకున్న భార్యాభ‌ర్త‌లు( Couples ) క‌ల‌కాలం క‌లిసి జీవించాల‌ని. సంసారం జీవితం నిండు నూరేళ్లు.. మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తుంటారు. కానీ ఈ విలువ‌లు ఎవ‌రూ పాటించ‌డం లేదు. పెళ్లాన్ని( Wife ) వ‌దిలిపెట్టి.. మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుని, వారిని రెండో పెళ్లిగా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌తి రోజు ఎక్క‌డో ఒక చోట చూస్తూనే ఉంటాం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని బ‌రేలీ( Bareilly ) జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌కు ప‌దేండ్ల క్రితం పెళ్లి అయింది. కానీ కొంత‌కాలం నుంచి భ‌ర్త( Husband ) ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తూ.. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. విష‌యం తెలుసుకున్న మొద‌టి భార్య‌.. త‌న భ‌ర్త‌ను న‌డిరోడ్డుపై నిల‌దీసింది. త‌న‌కు ద్రోహం చేశావ‌ని, మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించింది. అంత‌టితో ఆగ‌కుండా ప‌బ్లిక్‌గానే త‌న భర్త‌పై మొద‌టి భార్య చెప్పుతో చిత‌క్కొట్టింది. ఇక ఏమీ ప‌ట్ట‌న‌ట్టు భ‌ర్త కూడా అటు నుంచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు.

ఈ సంద‌ర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. నాకు పెళ్లై ప‌దేండ్లు అవుతుంది. కొన్నేండ్లు బాగానే ఉన్నాం. గ‌త కొంత‌కాలం నుంచి నా భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. నాతో స‌రిగా మాట్లాడం లేదు. కుటుంబ పోష‌ణ‌కు కూడా డ‌బ్బులు ఇవ్వ‌డం లేదు. ఏంటి అని ఆరా తీస్తే.. అత‌ను మ‌రో మ‌హిళ‌తో తిరుగుతున్నాడ‌ని, ఆమెను పెళ్లి కూడా చేసుకున్న‌ట్లు తెలిసింద‌ని బాధితురాలు వాపోయింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు ఆమె తెలిపారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆమె పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

ఇక భ‌ర్త‌పై చెప్పుతో దాడి చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోపై పోలీసులు కూడా స్పందించారు. త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు పేర్కొన్నారు.