Z+ Security | పిల్ల ఏనుగుకు ‘జ‌డ్ ప్ల‌స్’ సెక్యూరిటీ.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!

Z+ Security | సాధారణంగా వీవీఐపీ( VVIP )లు, ప్రముఖ రాజకీయ నేతలు( Political Leaders ), సెలబ్రెటీలకు( Celebrities ) జ‌డ్ ప్ల‌స్ కేటగిరీ భద్రత( Z+ Security )కల్పిస్తారు. వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. అయితే ఓ పిల్ల ఏనుగు( Baby Elephant )కు ఇలాంటి భద్రత కల్పించడం ఎప్పుడైనా చూశారా? అవును ఈ భద్రత చూస్తే మీరు కూడా అవాక్కవ్వక తప్పదు.

Z+ Security | పిల్ల ఏనుగుకు ‘జ‌డ్ ప్ల‌స్’ సెక్యూరిటీ.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!

Z+ Security | అడవి జంతువులకు( Wild Animals ) సంబంధించిన పలు వీడియోలు సోష‌ల్ మీడియా( Social Media )లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోలను చూస్తే మనసుకు కూడా ఎంతో హాయి క‌లుగుతుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లలకు కుటుంబం ఎంత రక్షణగా ఉంటుందో.. ఆ మాదిరిగానే జంతువులు కూడా త‌మ పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటారన‌డానికి ఈ వీడియో నిద‌ర్శ‌నం. మ‌న‌షుల‌కే కాదు జంతువుల‌కు కూడా బాధ్య‌త‌లు ఉంటాయ‌ని నిరూపిస్తుంది ఈ వీడియో.

ఈ నెల 11న మ‌ద‌ర్స్ డే( Mothers Day ) సంద‌ర్భంగా ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ర‌మేశ్ పాండే( Ramesh Pandey ) ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ పిల్ల ఏనుగు( Baby Elephant ) న‌దిలో సేద తీరేందుకు దిగింది. ఇక ఆ పిల్ల ఏనుగుకు కాప‌లాగా ఏనుగుల( Elephants ) స‌మూహం వ‌చ్చి చేరింది. న‌దిలో జ‌లాకాల‌ట‌లో మునిగి తేలుతున్న పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు ర‌క్ష‌ణ‌గా నిలిచాయి. పిల్ల ఏనుగుకు జ‌డ్ ప్లస్ సెక్యూరిటీ( Z+ Security )అని ఈ దృశ్యాన్ని ర‌మేశ్ పాండే అభివ‌ర్ణించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

జ‌డ్ ప్లస్ కేట‌గిరి భ‌ద్ర‌త ఎవ‌రికి క‌ల్పిస్తారు..?

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం, హైకోర్టు జడ్జిలు, గవర్నర్లు, సీఎంలు, కేంద్ర కేబినెట్ సభ్యులకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత మందికి జడ్ ప్లస్ సెక్యూరిటీ పొందుతున్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలూ భద్రత ఉంటుంది.

జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సీఐఎస్ఎఫ్‌లు భద్రత నిర్వహిస్తారు. కొన్నిసార్లు ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎస్కార్ట్‌గా ఉంటారు. జడ్ ప్లస్ కేటగిరీలో భాగంగా రక్షణ కల్పించే ఎన్ఎస్‌జీ కమాండోల దగ్గర ఎంపీ5 సబ్ మెషిన్ గన్లు, ఏకే-47 రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి.