టాటా పవర్ అరుదైన ఘనత.. 1.5 లక్షల పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు

- 3 GW సామర్థ్యంతో కీలక మైలురాయి దాటిన టాటా పవర్
- 700 పైగా నగరాలకు విస్తరణ
దేశంలోనే నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ప్రొవైడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ టాటా పవర్ భారతదేశవ్యాప్తంగా 1,50,000 రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ల మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ల మొత్తం సామర్థ్యం ఇప్పుడు సుమారు 3 GWకు చేరింది. భారతదేశ పునరుత్పాదక విద్యుత్ పరివర్తనలో కంపెనీ పోషిస్తున్న కీలక పాత్రకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
700 పైచిలుకు నగరాల్లో కార్యకలాపాలతో టాటా పవర్ రెన్యువబల్ ఎనర్జీ లిమిటెడ్‌లో (TPREL) భాగమైన టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్, సుస్థిరమైన మరియు విద్యుత్తును ఆదా చేసే భవిష్యత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రస్థానంలో ముందువరుసలో ఉంటోంది. టాటా పవర్ సోలారూఫ్ పేరిట మార్కెట్ చేయబడే టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్‌తో విద్యుత్ బిల్లులు 80 శాతం తగ్గుదల, సోలార్ మాడ్యూల్స్‌పై 25 ఏళ్ల వారంటీ, 4-7 ఏళ్ల పేబ్యాక్ వ్యవధిలాంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా 3-5 శాతం మేర వార్షికంగా పెరిగే విద్యుత్ టారిఫ్‌ల భారం నుంచి కూడా ఈ వ్యవస్థ రక్షణ కల్పిస్తుంది. కంపెనీ తమ తమిళనాడు ఫ్యాక్టరీలో ALMM ఆమోదిత సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తోంది.
పీఎస్‌యూలు మరియు ప్రైవేట్ బ్యాంకులు సహా 20 పైగా ఆర్థిక భాగస్వాముల ద్వారా టాటా పవర్ సరళతరమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. తద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి తెస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలు మరియు తమ ఫ్లాగ్‌షిప్ ‘ఘర్‌ఘర్ సోలార్’ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమల్లో కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ కస్టమర్లకు అనువైన సోలార్ రూఫ్‌టాప్ సొల్యూషన్స్ అందించడం ద్వారా ఇంధన భద్రత, సుస్థిరత సాధించాలన్న భారత లక్ష్య సాధనకు కంపెనీ దోహదపడుతోంది.
నిరాటంకంగా సర్వీస్, సపోర్ట్ అందించేందుకు కంపెనీకి దేశవ్యాప్తంగా 300 పైచిలుకు నగరాల్లో 575 పైగా చానల్ పార్ట్‌నర్లు, 400+ నగరాల్లో 225 పైగా అధీకృత సర్వీస్ భాగస్వాములు ఉన్నారు. రెసిడెన్షియల్ రంగంలో 1,22,000+ వినియోగదారులు సహా 1,50,000 + కస్టమర్ల బేస్‌తో గృహాల యజమానులు, వ్యాపారాలు, పరిశ్రమలు ప్రాధాన్యమిచ్చే సోలార్ భాగస్వామిగా కంపెనీ పటిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది. ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఏడాది వ్యాప్తంగా టాటా పవర్ సోలారూఫ్ తమ ప్రచార కార్యక్రమాల ద్వారా భారత్‌లో రూఫ్‌టాప్ సోలార్‌పై విస్తృతంగా అవగాహన కల్పించింది. సౌర విద్యుత్తును వినియోగించుకోవాలంటూ అవగాహనను పెంపొందించేందుకు కుంభమేళా, ఛత్ పూజాలాంటి సందర్భాలను ఉపయోగించుకుంది. అలాగే, పైకప్పులను సౌర విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించుకునేలా, శ్రేయస్సు మరియు వ్యక్తిగత వృద్ధికి వనరుగా మార్చుకునేలా గృహాల యజమానులను ప్రోత్సహించేలా మకర సంక్రాంతి సందర్భంగా 2025 జనవరిలో తమ తాజా ప్రచార కార్యక్రమం ‘ఆప్‌కీ రూఫ్, ఆప్‌కీ తాకత్’ను ప్రారంభించింది.
కీలక మైలురాయిని సాధించిన తరుణంలో విద్యుత్తుపరమైన స్వేచ్ఛ, ఆర్థిక పొదుపు, సుస్థిర భవిష్యత్తును సాధించేలా కస్టమర్లకు సాధికారత కల్పించే దిశగా అత్యుత్తమమైన, విశ్వసనీయమైన, అఫోర్డబుల్ సోలార్ సొల్యూషన్స్‌ను అందించేందుకు టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కట్టుబడి ఉంది. సోలార్ రూఫ్‌టాప్‌లపై ఫోకస్ చేయడంతో పాటు సోలార్ తయారీపైనా టాటా పవర్ గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. తద్వారా సోలార్ వేల్యూ చెయిన్‌ను మరింత పటిష్టం చేస్తోంది. 4.3 GW సెల్ మరియు మాడ్యూల్ తయారీ సామర్థ్యం, 3+GW రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లతో టాటా పవర్‌కి భారత్‌లో పటిష్టమైన తయారీ బేస్ ఉంది. స్వచ్ఛ ఇంధనాలవైపు భారత పరివర్తనను వేగవంతం చేయడంలో కంపెనీకి గల సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
1. 10 ఏళ్లుగా, నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలర్‌గా బ్రిడ్జ్ టు ఇండియా (బీటీఐ) గుర్తింపు
2. తమ ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PMSGY) కింద భారీ స్థాయిలో వినియోగానికి తోడ్పాటు
3. తమిళనాడులోని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అధునాతన ప్లాంటులో తయారు చేసిన, ALMM సర్టిఫికేషన్ పొందిన సోలార్ ప్యానెళ్లతో PMSGYకి సాధికారత
4. నిరాటంకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు మరియు 25 ఏళ్ల వారంటీ గల అత్యంత నాణ్యమైన మాడ్యూల్స్‌తో కస్టమర్లకు తోడ్పాటు