Viral: భూమి మీద.. ఇంకా నూకలున్నయ్! క్షణాల్లో తప్పించుకున్నడు (వీడియో)

విధాత: అదృష్టవంతుడిని ఎవడు చెడపలేడు.. దురదృష్టవంతుడిని ఎవడు బాగు చేయలేడన్న సామెతను తలిపించింది ఓ మోటార్ సైకిల్ అక్సిడెంట్. ఓ బైక్ పై వెలుతున్న ముగ్గురు ప్రమాదవశాత్తు ఓ కాలువలో పడిపోయిన ఘటనలో ఒకరు నాలా వంతెన రెయిలింగ్ పట్టుకుని బతికిపోయిన ఘటన వీడియో వైరల్ గా మారింది. బైక్ పె ముగ్గురు యువకులు వెలుతున్న క్రమంలో ఓ చౌరస్తా వద్దకు రాగానే వారికి అడ్డుగా అదే మార్గంలో ఓ వ్యాన్ వచ్చింది. వ్యాన్ ను తప్పించే క్రమంలో అదుపు తప్పిన బెక్ నడుపుతున్న యువకుడు అదే రోడ్డు మార్గంలోని నాలలోకి దూసుకపోయాడు.
అయితే వేగంగా బైక్ కాలువలో పడిపోతున్న క్రమంలో వెనుక కూర్చున్న యువకుడు కాలువ వంతెన రెయిలింగ్ ను అందుకున్నాడు. దీంతో అతను కాలువలో పడిపోకుండా సురక్షితంగా బయటపడ్డారు. బైక్ పై ఉన్న మిగతా ఇద్దరు మాత్రం బైక్ తో పాటు కాలువలో పడి మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రియల్ హీరో వాడేనని.. అదృష్టవంతుడంటే అతడేనని..స్టంట్ మాస్టర్ ను తలదన్నేలా కాలువలో పడిపోకుండా వంతెన రెయిలింగ్ ను క్యాచ్ చేశాడని కామెంట్లతో అభినందిస్తున్నారు.