బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

విధాత: బంజారాహిల్స్ లో శనివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఓ కారు ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఈ ఘటనలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.