ALLU ARJUN | ఆదిపురుష్‌లో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్‌.. ఎక్క‌డో తెలుసా?

ALLU ARJUN | భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ప్ర‌భాస్ ఆదిపురుష్ మంచి ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. మ‌రోవైపు అదే స్థాయిలో విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. ఇది వాల్మీకీ రామాయ‌ణానికి ఏ మాత్రం ద‌గ్గ‌ర‌గా లేద‌ని సంప్ర‌దాయ‌ వాదులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. త‌న అమ్మాయికి ఇలాంటి రామాయ‌ణాన్ని చూపించ‌లేక టికెట్లు కేన్సిల్ చేశాన‌ని ఓ మ‌హిళ ట్వీట్ చేయ‌గా.. రామాయ‌ణంలో ఎలా ఉందో.. ఆదిపురుష్‌లో క‌థ ఎలా ఉందో ఒక యూజ‌ర్ సోదాహ‌ర‌ణంగా వివ‌రించాడు. I have cancelled tickets of […]

  • By: krs    news    Jun 19, 2023 7:33 AM IST
ALLU ARJUN | ఆదిపురుష్‌లో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్‌.. ఎక్క‌డో తెలుసా?

ALLU ARJUN |

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ప్ర‌భాస్ ఆదిపురుష్ మంచి ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. మ‌రోవైపు అదే స్థాయిలో విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. ఇది వాల్మీకీ రామాయ‌ణానికి ఏ మాత్రం ద‌గ్గ‌ర‌గా లేద‌ని సంప్ర‌దాయ‌ వాదులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

త‌న అమ్మాయికి ఇలాంటి రామాయ‌ణాన్ని చూపించ‌లేక టికెట్లు కేన్సిల్ చేశాన‌ని ఓ మ‌హిళ ట్వీట్ చేయ‌గా.. రామాయ‌ణంలో ఎలా ఉందో.. ఆదిపురుష్‌లో క‌థ ఎలా ఉందో ఒక యూజ‌ర్ సోదాహ‌ర‌ణంగా వివ‌రించాడు.

సందిట్లో స‌డేమియా లాగ ట్రోల‌ర్స్ సైతం సినిమా సీన్ల‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వాన‌ర సైన్యంలోని ఒక వాన‌రుడు అల్లు అర్జున్‌ను పోలి ఉండ‌టంతో.. ఆ స్క్రీన్ షాట్ నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

ఎడిటింగ్ చేసేట‌పుడు టీంకు ఆ మాత్రం స్పృహ లేదా అని అల్లు అభిమానులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అల్లు అర్జున్ ఆదిపురుష్‌లో అతిథి పాత్ర‌లో మెరిశాడ‌ని చెప్పుకొంటున్నారు.