Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప‌నికి కోపంతో ఊగిపోయిన అమితాబ్.. ఏకంగా స్క్రీన్ ప‌గ‌ల‌గొట్టేశారుగా..!

Pawan Kalyan | ప్ర‌తి హీరోకి కూడా వారి కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీ ఉంటుంది. అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తొలి ప్రేమ అనే చిత్రం మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ హీరో జాబితాలో చేరాడు. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇటీవ‌ల రీరిలీజ్ చేశారు. చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. కరుణాక‌ర‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి ప్రేమ సినిమాలో ప‌వ‌న్ […]

  • By: sn    news    Jun 30, 2023 5:14 PM IST
Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప‌నికి కోపంతో ఊగిపోయిన అమితాబ్.. ఏకంగా స్క్రీన్ ప‌గ‌ల‌గొట్టేశారుగా..!

Pawan Kalyan | ప్ర‌తి హీరోకి కూడా వారి కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీ ఉంటుంది. అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తొలి ప్రేమ అనే చిత్రం మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ హీరో జాబితాలో చేరాడు. ఈ చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇటీవ‌ల రీరిలీజ్ చేశారు. చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

కరుణాక‌ర‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి ప్రేమ సినిమాలో ప‌వ‌న్ సరసన కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించింది. పవన్ కు చెల్లెలిగా వాసుకి కనిపించింది. ఇక చిత్రంలో ప్ర‌తి స‌న్నివేశం కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఇటీవ‌ల మూవీ రీరిలీజ్ చేసిన సంద‌ర్భంగా క‌రుణాక‌ర‌న్ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని పంచుకున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్.. త‌న భార్య‌తో క‌లిసి తొలి ప్రేమ సినిమా చూసార‌ని క‌రుణాక‌ర‌ణ్ అన్నాడు. అయితే సినిమా క్లైమాక్స్ అమితాబ్ బచ్చన్ కి చాలా చిరాకు తెప్పించింద‌ట‌.. హీరోయిన్​ను అంత‌గా ప్రేమించే పవన్.. క్లైమాక్స్​ టైమ్​లోనూ తన ప్రేమ విషయాన్ని చెప్పలేక చాలా మ‌ద‌న‌ ప‌డుతుంటాడు. ఇది చూసిన బిగ్ బీ ఆగ్ర‌హంతో తన కారు తాళపు చెవిని స్క్రీన్​ మీదకు విసిరేశారని కరుణాకరన్ ఆ నాటి విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎప్పుడైతే హీరోయిన్ తిరిగి హీరో ద‌గ్గ‌ర‌కు వ‌స్తుందో అప్పుడు బిగ్ బీ ప‌క్క‌న కూర్చున్న జయా బచ్చన్ సంతోషంతో చప్పట్లు కొట్టారని క‌రుణాక‌ర‌ణ్ స్ప‌ష్టం చేశారు. అయితే చెన్నైలో ఓ సంద‌ర్భంలో క‌లిసిన‌ప్పుడు అమితాబ్ త‌న‌కు ఈ విష‌యం చెప్పిన‌ట్టు కరుణాక‌ర‌న్ పేర్కొన్నారు.

చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస విజ‌యాలు అందుకున్నా డు. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాస్త యావరేజ్‌గానే ఆడినా.. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు పవన్ స్థాయిని మ‌రింత పెంచేసాయి. ఇక అలాంటి సమయంలో కొత్త దర్శకుడు ఏ కరుణాకరణ్ చెప్పిన కథ న‌చ్చ‌డంతో తొలి ప్రేమ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఇది సూప‌ర్ హిట్ కావ‌డం మ‌నం చూశాం. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేసే ఆలోచ‌న ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్.