3 నెలల్లో రూ.8వేల కోట్లు అప్పు తీసుకోనున్న ఆంధ్ర…. 6 వేల కోట్లు అప్పు తీసుకోనున్న తెలంగాణ
విధాత:దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,92,091 కోట్ల రుణ సేకరణకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన క్యాలెండర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. ★ ఈ త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం 4 విడతల్లో రూ.6 వేల కోట్ల రుణం సేకరించనుంది. ★ జులై 27న రూ.1,000 కోట్లు, ఆగస్టు 10న రూ.2,000, ఆగస్టు 24న రూ.1,000, సెప్టెంబర్ 7న రూ.2,000 కోట్లు తీసుకోనుంది. ★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం రూ.8 […]

విధాత:దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,92,091 కోట్ల రుణ సేకరణకు సిద్ధమయ్యాయి.
- ఇందుకు సంబంధించిన క్యాలెండర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది.
★ ఈ త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం 4 విడతల్లో రూ.6 వేల కోట్ల రుణం సేకరించనుంది.
★ జులై 27న రూ.1,000 కోట్లు, ఆగస్టు 10న రూ.2,000, ఆగస్టు 24న రూ.1,000, సెప్టెంబర్ 7న రూ.2,000 కోట్లు తీసుకోనుంది.
★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం రూ.8 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది.
★ బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా రాష్ట్రాలు ఈ రుణాన్ని సేకరించనున్నాయి