Chhattisgarh | చత్తీస్ గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

  • By: sr    news    Apr 12, 2025 7:58 PM IST
Chhattisgarh | చత్తీస్ గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

విధాత: చత్తీస్ గఢ్ అడువులు మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో దద్ధరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ కథనం మేరకు శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు, మావోయిస్టు పార్టీ నక్సల్స్ తారసపడడంతో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.

ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు యూనిఫాం ధరించిన ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంద్రావతి నది పరివాహ ప్రాంతంలోని భైరమ్ గడ్ సమీపంలో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయన్నారు.

చనిపోయిన నక్సలైట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి భారీ మొత్తంలో ఆయుధాలు,పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.