ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి .రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి మాల గుండ్ల శంకర నారాయణ .రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి .ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం .అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి .జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ విధాత,అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 8వ తేదీన జిల్లాలోని రాయదుర్గం వస్తున్న సందర్భంగా పర్యటనకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి […]

జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి .
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి మాల గుండ్ల శంకర నారాయణ .
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి .
ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం .
అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి .
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్
విధాత,అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 8వ తేదీన జిల్లాలోని రాయదుర్గం వస్తున్న సందర్భంగా పర్యటనకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి మాల గుండ్ల శంకర నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తో కలిసి మాల గుండ్ల శంకర నారాయణ, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాంలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.
ముఖ్యమంత్రి ఒకటిన్నర సంవత్సరం తర్వాత జిల్లాకు వస్తున్నారని, ఎలాంటి లోటుపాట్లు రానీయకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు. రాయదుర్గం పట్టణంలోని మొలకల్మురు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్ద వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు, ప్యాచ్ వర్క్ పనులు పూర్తిచేయాలని, పట్టణంలో డివైడర్ ల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు, అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేయాలని ఆర్ అండ్ బి ఎస్ ఈని ఆదేశించారు. తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా బాగా చేయాలని మున్సిపల్ కమిషనర్, ఆర్డీవోలను ఆదేశించారు. కరోనా అనంతరం ముఖ్యమంత్రి మొట్టమొదటి సమావేశం నిర్వహిస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలన్నారు. బహిరంగ సభ వద్ద మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని, కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిఎంఅండ్హెచ్ఓను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ పరిశీలన చేయాలన్నారు. పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల అధికారులు టీం వర్క్ గా పనిచేసి పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి : ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం
ఈనెల 8న రాయదుర్గం పట్టణంలో చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన రైతు దినోత్సవం చాలా ముఖ్యమైనదని, ఆ రోజున వైఎస్ జగన్ రాయదుర్గం పట్టణంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని, ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదివరకే రెండు సార్లు పర్యటించారని, ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసిన విధంగా ప్రస్తుతం చేపట్టిన పర్యటనను కూడా జయప్రదం చేయాలన్నారు. వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించే గ్రౌండ్ అంతా వర్షం పడినా బురదమయం కాకుండా చూడాలని, అందుకు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో సభకు ఎక్కువమందిని హాజరుకాకుండా చూడాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులంతా పనిచేయాలని సూచించారు.
అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి : జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. బహిరంగ సభ వద్ద భూమి లెవెలింగ్ పనులు, జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు, స్టాల్స్ ఏర్పాటు, అన్ని రకాల పనులు పూర్తిచేయాలన్నారు. ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తి చేయడం, హెలిప్యాడ్ స్థలం ప్రిపేర్ చేయడం, బ్యారికేడ్లు ఏర్పాట్లు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు, వి ఐ పి వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని ఆర్అండ్బి ఎస్ఈని ఆదేశించారు. సీఎం కాన్వాయ్ ఏర్పాట్లు చేయాలని డిటిసికి, పట్టణ, గ్రామీణ రహదారులను పూర్తి చేయాలని, ప్రతి రహదారి కూడా ఎలాంటి ప్యాచెస్ లేకుండా శుభ్రంగా ఉండాలని పీఆర్ ఎస్ఈ, ఆర్అండ్బి ఎస్ఈ, నేషనల్ హైవే ఎస్ఈలను ఆదేశించారు. ప్రతి చోటా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈకి సూచించారు.
ప్రజలకు నీటి సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని, పట్టణమంతా పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, జంతువులు కనిపించకుండా చూడాలన్నారు. బహిరంగ సభ వద్ద థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేయాలని, మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలని, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని డిఎంఅండ్హెచ్ఓని ఆదేశించారు. సీఎం పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ ఫైర్ సేఫ్టీ పరిశీలన చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ ని ఆదేశించారు. ప్రజలకు, విఐపిలకు అందించే భోజనాన్ని పరిశీలించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సూచించారు. మార్కెట్ యార్డులోని అగ్రి ల్యాబ్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని, అవసరమైన సామాగ్రి సిద్ధం చేయాలని అనంతపురం ఆర్డీవోని, స్టాల్స్ ఏర్పాటు జాగ్రత్తగా చేయాలని ధర్మవరం ఆర్డీవోని ఆదేశించారు. ప్రధాన వేదిక వద్ద కుర్చీల ఏర్పాటు, ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
నీటి సరఫరా, శానిటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలని, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. హెలిప్యాడ్ నుంచి మెయిన్ రోడ్ వరకు రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే ప్రతి ప్రాంతం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ వరప్రసాద్, డిపిఓ పార్వతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రవీంద్ర, వరప్రసాద్, ఆర్ డి వో లు నిశాంత్ రెడ్డి, గుణ భూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.