Asin | విడాకుల వార్తలు.. అసిన్ ఇలా రియాక్ట్ అయిందేంటి?
Asin విధాత: ఈ మధ్య కాలంలో సినీతారల వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా వినిపించే మాట విడాకులు. పలానా వాళ్లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొన్న చైతు-సమంత, తర్వాత మెగా డాటర్ శ్రీజ - కళ్యాణ్ దేవ్ (ఇంకా బయటికి ప్రకటించలేదు), ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కూతురు నిహారిక - చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని, ఇంకోసారి ఆల్రెడీ తీసేసుకున్నారనేలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీరిలో చైతన్య, […]

Asin
విధాత: ఈ మధ్య కాలంలో సినీతారల వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా వినిపించే మాట విడాకులు. పలానా వాళ్లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొన్న చైతు-సమంత, తర్వాత మెగా డాటర్ శ్రీజ – కళ్యాణ్ దేవ్ (ఇంకా బయటికి ప్రకటించలేదు), ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కూతురు నిహారిక – చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని, ఇంకోసారి ఆల్రెడీ తీసేసుకున్నారనేలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
వీరిలో చైతన్య, సమంతలు అధికారికంగా విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. ఇక మెగా డాటర్స్ సంగతి తేలాల్సి ఉంది. వీరి సంగతి ఇలా ఉంటే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరొందిన అసిన్ పేరు.. ఈ విడాకుల విషయంలో బాగా హైలెట్ అవుతోంది.
‘గజినీ’ ఫేమ్ నటి అసిన్ విషయంలోనూ ఇలాంటి రూమర్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంత వరకూ నిజమనేది తేలాల్సి ఉంది. పెళ్లిళ్ళు పెటాకులు కావడం ఇంత సంబరం ఏంటో నెటిజన్లకే తెలియాలి. నటి 2016లో అసిన్, రాహుల్ శర్మతో పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా, ఒక పాపతో సంతోషంగా ఉంటున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త రావడంపై తాజాగా అసిన్ స్పందించింది.
మేం ఇద్దరం విడిపోయామనే వార్త తెలిసి.. మా జీవితంలో ఓ 5 నిమిషాల పాటు ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు బాధ పడుతున్నానని రియాక్ట్ అయింది. అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్త రాహుల్ ఫోటోలను తీసేసింది. దీంతో ఇద్దరూ విడిపోతున్నారనే దుమారం రేగింది.
ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కానీ.. వినిపిస్తున్న రూమర్స్‌పై మాత్రం అలాంటిది ఏం లేదని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా అయితే అర్థమవుతుంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అసిన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్, లక్ష్మీ నరసింహా, అన్నవరం’ వంటి చిత్రాలలో ఆమె నటించింది.