కేటీఆర్: రాముడి భూముల కబ్జాపై రామచందర్ రావుకు మౌనం ఎందుకో?

కేటీఆర్: రాముడి భూముల కబ్జాపై రామచందర్ రావుకు మౌనం ఎందుకో?

కేటీఆర్: విధాత, హైదరాబాద్ : ఏపీలో భద్రాచలం రాముడి ఆలయ భూముల కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి కబ్జా అయినా బీజేపీ నుంచి ఒక్క మాట కూడా లేదన్నారు. రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచలం దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలని కోరారు.

మరోవైపు ఇటీవల భద్రాచలం దేవస్థానికి చెందిన ఏపీ పరిధిలో ఉన్న మాన్యం భూములను కబ్జా చేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ఖండించారు. భద్రాచలం రామాలయ భూముల పరిరక్షణకు వెళ్లిన తెలంగాణ అధికారిపై ఆంధ్రా వాళ్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.