Bonalu | బోనాలకు వేళాయే.. జూన్ 26న హైదరాబాద్‌లో తొలిబోనం

  • By: TAAZ    news    Jun 10, 2025 4:35 PM IST
Bonalu | బోనాలకు వేళాయే.. జూన్ 26న హైదరాబాద్‌లో తొలిబోనం

Bonalu | ఆషాడ బోనాలు జూన్‌ 26 నుండి జూలై 24 వరకు హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ పొన్నం ప్రభాకర్,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈనెల 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 31న రంగం( భవిష్యవాణి) ఉంటుంది. జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20న సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాలను లు నిర్వహించడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని మంత్రులు వెల్ల‌డించారు.