Viral: ఇదెక్కడి విడ్డూరం.. పుచ్చకాయ కొనేందుకు చాట్‌జీపీటీ! (వీడియో)

విధాత: అధునిక సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న కొద్ధి మానవులపై పనిభారం తగ్గుతూ వస్తుంది. తొలుత రోబోలు, ఏఐ రోబోలు, ఏఐ చాట్ జీపీటీలు ఇలా కొత్త సాంకేతిక మానవుడి దైనందిక జీవనంలో భాగమై పోయింది. మఖ్యంగా చాట్ జీపీటీ వినియోగం ఇటీవల అధికమవ్వగా ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు కూడా చాట్‌జీపీటీని వినియోగించిన వీడియో వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు ఇదెక్కడి చోద్యం నాయనా…పుచ్చకాయ కొనేందుకు కూడా ఏఐ వినియోగమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు పుచ్చకాయల దుకణానికి వెళ్లాడు. తన సెల్ ఫోన్ లో చాట్‌జీపీటీ సాయంతో పుచ్చకాయలను పరిశీలించాడు. అందులో స్వీట్, రెడ్‌గా ఉన్న పుచ్చకాయను గుర్తించాలని అతడు ఏఐ చాట్ జీపీటీని కోరాడు.
కొన్నింటిని పరిశీలించాక ఒకదానిని చాట్ జీపీటీ సూచించింది. అది ఎంపిక చేసిన పుచ్చకాయను కోసి చూడగా పండు ఎర్రగా ఉంది. దీంతో చాట్ జీపీటీ సరైన పుచ్చకాయనే ఎంపిక చేసిందని..చాట్ జీపీటీ సరిగానే పనిచేస్తుందని ఆ వ్యక్తి కితాబిచ్చాడు. ప్రస్తుతం ఈ పుచ్చకాయ చాట్ జీపీటీ వ్యవహారం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.