అమరావతి పునఃప్రారంభ పనులకు రండి : ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం

విధాత: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు రావాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
అమరావతి పునఃప్రారంభ పనుల సందర్భంగా లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్ నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ ఎస్వీ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.