రెండు డోసులు తీసుకున్న 40 వేల మందికి కరోనా

విధాత:కేరళలో కరోనా కొత్త వేరియంట్లు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న 40వేల మందికిపైగా కేరళీయులకు ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు పలు ఆంగ్ల వార్తా చానళ్లకు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి దాదాపు లక్ష కేసులను గుర్తించగా, వాటిలో 40వేలు ఒక్క కేరళలోనే నమోదవడం అక్కడ వైరస్‌ ఉధృతికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆ 40వేల మంది కొవిడ్‌ శాంపిళ్లను సేకరించి, జన్యుక్రమాల విశ్లేషణ […]

రెండు డోసులు తీసుకున్న 40 వేల మందికి కరోనా

విధాత:కేరళలో కరోనా కొత్త వేరియంట్లు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న 40వేల మందికిపైగా కేరళీయులకు ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు పలు ఆంగ్ల వార్తా చానళ్లకు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి దాదాపు లక్ష కేసులను గుర్తించగా, వాటిలో 40వేలు ఒక్క కేరళలోనే నమోదవడం అక్కడ వైరస్‌ ఉధృతికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆ 40వేల మంది కొవిడ్‌ శాంపిళ్లను సేకరించి, జన్యుక్రమాల విశ్లేషణ (జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌) కు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే కేరళలో ఏ వేరియంట్‌ వ్యాపిస్తోంది? అది కొత్త వేరియంటేనా? అనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తోంది.

ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో గత 5 రోజుల్లో దాదాపు 242 మంది పిల్లలకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఈ పరిణామం కరోనా మూడోవేవ్‌కు సంకేతమే అయి ఉండొచ్చనే ఆందోళన మొదలైంది. గత 24 గంటల్లో కర్ణాటకలో భారీగా 1338 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు 140 రోజుల కనిష్టానికి తగ్గి 3,86,351కి చేరాయి. గత 24 గంటల్లో 38,353 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3.20 కోట్లు దాటింది. 497 మంది కొవిడ్‌తో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,29,179కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 17.77 లక్షల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 48.50 కోట్లకు పెరిగింది.