కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ
విధాత,అమరావతి : కర్ఫ్యూ వల్ల కేసుల నమోదు తగ్గుదల ఎలా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులు నోడల్ అధికారి ద్వారా మాత్రమే చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా సరిగాలేదన్న ఏపీ ప్రభుత్వం..కేంద్రం నుంచి తగినన్ని 'రెమ్‌డెసివిర్' వైల్స్ రావట్లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కలకు, సరఫరాకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు కోర్టుకు తెలియజేసింది. కేంద్రం నుంచి డిమాండ్‌కు సరిపడా ఆక్సిజన్ సరఫరా జరగట్లేదని వివరించింది. తక్కువ కేసులున్న […]

విధాత,అమరావతి : కర్ఫ్యూ వల్ల కేసుల నమోదు తగ్గుదల ఎలా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులు నోడల్ అధికారి ద్వారా మాత్రమే చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా సరిగాలేదన్న ఏపీ ప్రభుత్వం..కేంద్రం నుంచి తగినన్ని ‘రెమ్‌డెసివిర్’ వైల్స్ రావట్లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కలకు, సరఫరాకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు కోర్టుకు తెలియజేసింది.
కేంద్రం నుంచి డిమాండ్‌కు సరిపడా ఆక్సిజన్ సరఫరా జరగట్లేదని వివరించింది. తక్కువ కేసులున్న తెలంగాణకు 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కేంద్రం.ఎక్కువ కేసులతో సతమతమవుతున్న రాష్ట్రానికి కేవలం 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్లు పేర్కొంది.ఆక్సిజన్ సరఫరాలో తేడాలపై ధర్మాసనం కేంద్రాన్ని సైతం ప్రశ్నించింది.రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామన్నట్లు కేంద్రం తరఫున వాదించిన న్యాయవాది చెప్పారు.తగినన్ని ప్లాంట్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా.. కంప్రెసర్ల తయారీలో జాప్యం జరుగుతోందన్న కేంద్రం, అందుకు మూడు నెలల సమయం పడుతుందని వివరించింది.
జూన్ మొదటి వారంలో 15 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం.వీలైనంత త్వరగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని కేంద్రానికి సూచించింది.తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.