King Cobra: ఇంత పెద్ద నాగు పామును.. మీరు ఎప్పుడైనా చూసారా..?

కింగ్ కోబ్రాలను చూస్తేనే దడ పుడుతుంది. అందులోనూ ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రా (గిరినాగు.. రాచనాగు) ను దగ్గరగా చూస్తే గుండె గుభేల్ మనక మానదు. కర్నూలు జిల్లా, ఆదోని నియోజకవర్గం బెల్లెకల్ వాసులు గ్రానైట్ క్వారీలో భారీ రాచనాగును చూసి తలో దిక్కుకు పారిపోయారు. సూమారు 20అడుగుల పొడవు ఉన్న భారీ కింగ్ కొబ్రా వీడియోను స్థానికుల సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్ గా మారింది.
తన స్థావరంగా ఉన్న గుట్టలను గ్రానైట్ కోసం తొలచివేస్తుండటంతో ఆ భారీ రాచనాగు చెదిరిపోయిన తన గూడు నుంచి మరో చోటును వెతుక్కుంటూ బుసలు కొడుతు వెలుతుండగా దానిని స్థానికులు భయం భయంగా వీడియో తీశారు. జనారణ్యాల విస్తరణ పాముల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయనడానికి ఇటీవల తరచూ భారీ సైజులో రకరకాల పాములు దర్శణం ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
Giri Nagu: రైతులను.. పరుగులు పెట్టించిన 15 అడుగుల గిరి నాగు..!
Giri Nagu: రైతులను.. పరుగులు పెట్టించిన 15 అడుగుల గిరి నాగు..!