చిలకలగూడ రైల్వే ఆరోగ్య కేంద్రానికి ఏడు ఆక్సిజన్ కాన్సన్దేటర్లను విరాళం

విధాత:చిలకలగూడ రైల్వే ఆరోగ్య కేంద్రానికి హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్, ఆశా జ్యోతి మరియు డాక్లర్స్ ఫర్ యూ వంటి ప్రముఖ సంక్షేమ సంఘాలు 'ప్రాజెక్టు బ్రీత్ వెల్' ఆధ్యర్యంలో ఈ రోజు అనగా 29 మే 2021 తేదీన సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శ్రీ అభయ్ కుమార్ గప్తా సమక్షంలో ఏడు ఆక్సిజన్ కాన్సన్దేటర్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ ఎస్.వి.హనుమంత్ రెడ్డి, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ […]

చిలకలగూడ రైల్వే ఆరోగ్య కేంద్రానికి ఏడు ఆక్సిజన్  కాన్సన్దేటర్లను విరాళం

విధాత:చిలకలగూడ రైల్వే ఆరోగ్య కేంద్రానికి హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్, ఆశా జ్యోతి మరియు డాక్లర్స్ ఫర్ యూ వంటి ప్రముఖ సంక్షేమ సంఘాలు ‘ప్రాజెక్టు బ్రీత్ వెల్’ ఆధ్యర్యంలో ఈ రోజు అనగా 29 మే 2021 తేదీన సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శ్రీ అభయ్ కుమార్ గప్తా సమక్షంలో ఏడు ఆక్సిజన్ కాన్సన్దేటర్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ ఎస్.వి.హనుమంత్ రెడ్డి, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ ఎమ్. సురేంద్రనాథ్. 3150 రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ వై.వి.గిరి, ఆశా జ్యోతి సభ్యులు శ్రీ గణేష్ రావు మరియు రోటరీ క్లబ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు చెరో 5 లీటర్ల సామర్థ్యం గలవి మరియు 90 (+/-) 3% కాన్సషన్తో ఆక్సిజన్ ను ఉత్పత్తి అందజేస్తాయి.
నగరం నడిబొడ్డున చిలకలగూడలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ముఖ్యంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉండే అత్యధిక రైల్వే సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించబడుతున్నాయి. ఈ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ ఆక్సిజన్ కాన్సన్దేటర్ల సౌకర్యం ఎంతో తోడ్పడుతుంది. ఇవి తక్కువ ఆక్సిజన్ తో ఇబ్బంది పడే రోగుల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శ్రీ అభయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి తీవ్రత సమయంలో రోగుల చికిత్సకు ఆక్సిజన్ ఎంతో అవసరమని అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు. అదే బాటలో రోటరీ క్లబ్ ఆశా జ్యోతి మరియు డాక్టర్స్ ఫర్ యూ సంఘాలతో కలిసి 7 ఆక్సిజన్ కాన్సన్టర్లను విరాళంగా అందజేయడం అత్యంత ప్రశంసనీయమన్నారు. రైల్వే ఆరోగ్య కేంద్రంలోని రోగుల చికిత్సకు ఈ మెషిన్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని
ఆయన అన్నారు.

కోవిడ్ 19 మహమ్మారి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో సమయానుకూలంగా ఎంతో విలువైన సహకారం అందజేసిన హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్, డాక్టర్స్ ఫర్ యూ మరియు ఆశా జ్యోతి సంఘాల సేవలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య అభినందించారు.