Papua New Guinea Earthquake | పపువా న్యూ గినియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు

విధాత : ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మయన్మార్, థాయ్ లాండ్ లలో 7.7తీవ్రతతో కూడిన భూకంపంతో జరిగిన భారీ ప్రాణ, ఆస్తి నష్టం నుంచి తేరుకోకముందే మరిన్ని దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. తాజాగా పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదు అయింది.
పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లోని కింబే పట్టణానికి 194 కి. మీ దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీచేసింది.
మరోవైపు భూకంప బాధిత మయన్మార్, థాయ్ లాండ్ దేశాలలో పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. ఒక్క మయన్మార్ లోనే మృతుల సంఖ్య 3వేలు దాటింది. మయన్మార్ ను ఆదుకునేందుకు క్వాడ్ దేశాలు, భారత్ అమెరికా, అస్ట్రేలియా, జపాన్ దేశాలు 20మిలియన్ డాలర్ల మానవతా సహాయాన్ని అందించాయి. ఆపరేషన్ బ్రహ్మ ద్వారా భారత్ అందిస్తున్న సహాయానికి ఇది అదనమని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.