లిఫ్ట్ లో ఇరుక్కున బాలుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

లిఫ్ట్ లో ఇరుక్కున బాలుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

కుమారుడు లిఫ్ట్ లో ఇరుక్కోవడంతో అతడిని కాపాడలేకపోతున్నాన‌న్న‌ ఆందోళనతో తండ్రి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటు చేసుకున్నది. కుమారుడు క్షేమంగా బయటపడగా.. తండ్రి మాత్రం కొన్ని నిమిషాల్లోనే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది.

రిషిరాజ్ భట్నాగర్ అనే వ్యక్తి అతడి భార్య, ఇద్దరు కుమారులతో కలిసి భోపాల్ జత్కేడీ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అతడు తన కుమారుడిని వెతుక్కుంటూ కిందికి వచ్చాడు. కుమారుడు కింద కనిపించడంతో వెంటనే లిఫ్ట్ లో పైకి వెళ్లాలని సూచించాడు.

కాగా కుమారుడు లిఫ్ట్ ఎక్కిన కొద్ది సేపటికే పవర్ పోయింది. దీంతో తన కుమారుడు ఎక్కడ లిఫ్ట్ లో ఇరుక్కొని పోతాడోనన్న ఆందోళనతో రిషిరాజ్ కు గుండెపోటు వచ్చింది.కొన్ని నిమిషాల్లోనే అతడు కుప్పకూలి చనిపోయాడు. కాగా అతడి కుమారుడు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.