టీమిండియా కోచ్.. గంభీర్‌కు ఉగ్ర హెచ్చరికలు

  • By: sr    news    Apr 24, 2025 3:50 PM IST
టీమిండియా కోచ్.. గంభీర్‌కు ఉగ్ర హెచ్చరికలు

విధాత: భారత క్రికెట్ జట్టు కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఐసీస్ కశ్మీర్ పేరుతో బెదిరింపులు రావడం కలకలం రేపింది. ‘ఐ కిల్‌ యూ’ అంటూ రెండు ఈ-మెయిల్స్‌ వచ్చినట్లు సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు గంభీర్ ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్‌ సెల్ ఆ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారనే దానిపై విచారణ చేపట్టింది. పహల్గాం ఉగ్ర దాడిపై స్పందించినందుకే గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

బెదిరింపుల అంశంపై గంభీర్ ఢిల్లీలోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్‌ ఢిల్లీ పోలీసులను కోరాడు. ఐసీస్ కశ్మీర్‌ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

అంతకుముందు గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కోసం ప్రార్థిద్దాం. దీనికి బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారు. భారత్ తిప్పికొడుతుంది’’ అని గంభీర్‌ పహల్గాం ఘటనపై పోస్టు పెట్టారు. పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 26 మంది మృతి చెందారు. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

పాక్‌ ప్రధానిపై డానిష్ కనేరియా విమర్శలు

జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్‌ షరీఫ్ స్పందించక పోవడం పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria )విమర్శలు గుప్పించాడు. ప్రధాని షరీఫ్‌కు వాస్తవం తెలుసంటూ వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘‘పాకిస్థాన్‌కు ఎలాంటి పాత్ర లేకపోతే నేరుగా ప్రధాని షరీఫ్‌ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించాడు. దేశంలో ఎందుకు ఒక్కసారిగా హై అలెర్ట్‌ ప్రకటించారు? ఎందుకంటే వాస్తవం ఏంటో మీకు తెలుసని.. మీరే టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్నారని.. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది’’ అని పోస్టు పెట్టాడు. డానిష్ కనేరియా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.