Gold Rate | పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం..! భారీగా పతనమైన వెండి..!
Gold Rate | బంగారం కొనుగోలుదారులకు ధరలు కాస్త ఊరట కలిగించాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం దిగి వచ్చింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.100 తగ్గింది. మరో వైపు కిలో వెండి ధర రూ.600 పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ..59,430కి తగ్గింది. చెన్నైలో 22 […]

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు ధరలు కాస్త ఊరట కలిగించాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం దిగి వచ్చింది.
22 క్యారెట్ల తులం బంగారం ధర స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.100 తగ్గింది. మరో వైపు కిలో వెండి ధర రూ.600 పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ..59,430కి తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,750 ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర రూ.59,730కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,180 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,280 వద్ద ట్రేడవుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,180 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా పలు నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.75,700 వద్ద ట్రేడవుతున్నది. ఇంతక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోతున్నది. క్రితం సెషన్‌తో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేటు ఏకంగా 30 డాలర్లు పతనమైంది. ప్రస్తుతం 1916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 22.91 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూ.82.005 మార్క్ వద్ద కొనసాగుతున్నది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సూచనల నేపథ్యంలో డాలర్ బలపడుతుండగా.. బంగారం ధరలు దిగివస్తున్నాయి.