సిలేరు నది పడవ ప్రమాదంపై గవర్నర్ విచారం
విధాత ,విజయవాడ: విశాఖపట్నం జిల్లా సిలేరు రిజర్వాయర్‌లో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు, ప్రమాదంలో ఐదుగురు పిల్లలు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కందగుడ, గుంటవాడ గ్రామాలకు చెందిన కూలీలు ప్రయాణిస్తున్న రెండు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. సోమవారం రాత్రి తమ గ్రామాలకు వెళుతుండగా బోల్తా పడ్డాయి. ఈ కార్మికులు హైదరాబాద్ శివార్లలోని ఇటుక […]

విధాత ,విజయవాడ: విశాఖపట్నం జిల్లా సిలేరు రిజర్వాయర్‌లో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు, ప్రమాదంలో ఐదుగురు పిల్లలు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కందగుడ, గుంటవాడ గ్రామాలకు చెందిన కూలీలు ప్రయాణిస్తున్న రెండు పడవలు ప్రమాదానికి గురయ్యాయి.
సోమవారం రాత్రి తమ గ్రామాలకు వెళుతుండగా బోల్తా పడ్డాయి. ఈ కార్మికులు హైదరాబాద్ శివార్లలోని ఇటుక బట్టీలలో పనికి వెళ్లి లాక్డౌన్ కారణంగా తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ప్రమాదం అనంతరం ఇద్దరిని రక్షించగా, మరో ఇద్దరు తప్పిపోయినట్లు అధికారులు గవర్నర్‌కు తెలియజేశారు. తప్పిపోయిన వారిని గుర్తించడానికి అవసరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. రక్షించిన వ్యక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ అధికారులను ఆదేశించారు. గవర్నర్ శ్రీ హరిచందన్ బాధితుల కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.