BRS.. ఐటీ సెల్‌పై కేసు నమోదు

  • By: sr    news    Apr 03, 2025 7:30 PM IST
BRS.. ఐటీ సెల్‌పై కేసు నమోదు

విధాత: హెచ్ సీయూ విద్యార్థుల నిరసనలకు సంబంధించి ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి దిలీప్, క్రిశాంక్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఎడిట్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అందిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ మేరకు దర్యాప్తు చేపట్టి బీఆర్ ఎస్ ఐటీ సెల్ నేతలపై కేసు బుక్ చేశారు. దిలీప్, క్రిశాంక్ ఇద్దరు కూడా హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రజల్లో అశాంతిని కలించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా భూముల వివాదంపై ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పోస్టులు పెట్టారని తెలిపారు. వీరిపై 353 1(b), 353 1(c),353(2), 192, 196(1), 61 (1)(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.