విశాఖ ఘటనపై స్పందించిన హోంమంత్రి సుచరిత

విధాత :అమరావతి : విశాఖ నగరంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరా తీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఘటన జరగ్గానే అధికారులు అప్రమత్తం కావడాన్ని అభినందించారు. ఫైర్‌ సెన్సార్లు వెంటనే పనిచేశాయని పోలీసులు ఆమెకు వివరించారు.పరిశ్రమలోని పాత టెర్నినల్‌ క్రూడ్‌ డిస్టిలేషన్‌ 3వ యూనిట్‌లో మంటలను పూర్తిగా […]

విశాఖ ఘటనపై స్పందించిన హోంమంత్రి సుచరిత

విధాత :అమరావతి : విశాఖ నగరంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరా తీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఘటన జరగ్గానే అధికారులు అప్రమత్తం కావడాన్ని అభినందించారు. ఫైర్‌ సెన్సార్లు వెంటనే పనిచేశాయని పోలీసులు ఆమెకు వివరించారు.
పరిశ్రమలోని పాత టెర్నినల్‌ క్రూడ్‌ డిస్టిలేషన్‌ 3వ యూనిట్‌లో మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. కూలింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రిఫైనరీలో ఇతర కార్యకలాపాలను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.