HRC చైర్ పర్సన్.. లోకాయుక్తల నియామకం

  • By: sr    news    Apr 11, 2025 7:17 PM IST
HRC చైర్ పర్సన్.. లోకాయుక్తల నియామకం

విధాత : తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ ఆర్సీ) చైర్ పర్సన్ తో పాటు లోకాయుక్తలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ ఆర్సీ చైర్ పర్సన్‌గా రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను నియమించారు. లోకాయుక్తగా మాజీ జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డిలను నియమించారు.

హెచ్ ఆర్సీ చైర్ పర్సన్ పదవీ కాలం మూడేళ్లు. లోకాయుక్త పదవీ కాలం ఐదేళ్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఉప లోకాయుక్తగా జస్టిస్ బీఎస్.జగ్జీవన్ కుమార్(నాన్ జ్యుడీషియల్), మాజీ జడ్జీ ఎస్.ప్రవీణ(జ్యుడీషియల్) ను నియమించారు.