India Corona : కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
విధాత ,దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,070 కేసులు వెలుగులోకి రాగా.. 491 మరణాలు సంభవించాయి.నిన్న 17,22,221 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది.తాజాగా నమోదైన కేసుల కంటే రకవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 43,910 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ […]

విధాత ,దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,070 కేసులు వెలుగులోకి రాగా.. 491 మరణాలు సంభవించాయి.నిన్న 17,22,221 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది.తాజాగా నమోదైన కేసుల కంటే రకవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 43,910 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,10,99,771కి చేరి.. ఆ రేటు 97.39 శాతానికి చేరింది. ప్రస్తుతం 4,06,822 క్రియాశీల కేసులు(1.27 శాతం) ఉన్నాయి.ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న 55,91,657 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 50,68,10,492కి చేరింది.