జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యనేతల అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరడం సహా పలు సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం దిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర సహకారం తీసుకోవడంపైనా చర్చించాలని భావించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు, […]

జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యనేతల అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరడం సహా పలు సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం దిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర సహకారం తీసుకోవడంపైనా చర్చించాలని భావించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు, కొవిడ్‌ దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బిజీగా ఉన్న కారణంగా రేపు ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదని సమాచారం. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారయ్యాకే సీఎం దిల్లీ వెళ్లనున్నారు. వారం రోజుల్లో సీఎం దిల్లీ వెళ్లి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.