Kiran Rathod | బిగ్‌బాస్ 7 కిరణ్ రాథోడ్.. ఎంత మందితో ఎఫైర్ పెట్టుకుందో తెలిస్తే ఉలిక్కి పడతారు..!
Kiran Rathod | బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7 జరుపుకుంటుంది. ఈ సీజన్‌లో కిరణ్ రాథోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇప్పటి వారికి కిరణ్ రాథోడ్ గురించి అంతగా తెలియదు కాని అప్పట్లో ఆమె ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే కిరణ్ రాథోడ్‌కి సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేకపోవడంతో ఆమె చాలా అవకాశాలని […]

Kiran Rathod |
బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7 జరుపుకుంటుంది. ఈ సీజన్‌లో కిరణ్ రాథోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇప్పటి వారికి కిరణ్ రాథోడ్ గురించి అంతగా తెలియదు కాని అప్పట్లో ఆమె ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
అయితే కిరణ్ రాథోడ్‌కి సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేకపోవడంతో ఆమె చాలా అవకాశాలని వదులుకొని చివరికి మద్యానికి బానిసై చేజేతులారా తన కెరియర్ నాశనం చేసుకుంది. చిన్నప్పటి నుండి ఆమెకు మోడలింగ్ చేయాలని ఆశ చాలా ఉండేది. అలా మోడల్‌గా మారిన కిరణ్ రాథోడ్ బాలీవుడ్‌లో కూడా అవకాశం దక్కించుకుంది.
అక్కడ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సౌత్‌లో శరత్ కుమార్, కమల్ హాసన్ , రజనీకాంత్,అర్జున్ సార్జా, మమ్ముట్టి, మోహన్ లాల్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసింది.
ఇక తెలుగులో ఉదయ్ కిరణ్ శ్రీరామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అలరించిన కిరణ్.. నువ్వు లేక నేను లేను సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసి అలరించింది. అంతమంది స్టార్ హీరోల సరసన నటించిన కిరణ్ రాథోడ్ ఐటెం సాంగ్స్ చేయడం, ప్రాధాన్యత లేని పాత్రలో నటించడం వలన ఆమెకి క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.
కెరీర్ సజావుగా సాగని సమయంలో ఈ అమ్మడు సీక్రెట్ గా రామ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందట. ఆయనకి అప్పటికే పెళ్ళై పిల్లలు ఉండగా, అతనితో కొన్నాళ్లపాటు కాపురం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. ఇక ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ అయిన రాహుల్ తో కూడా రెండు సంవత్సరాల పాటు కిరణ్ రాథోడ్ డేటింగ్ చేసిందట.
ఇక ఆ తర్వాత.. సినిమా ఇండస్ట్రీలో సుందర్ ,అర్జున్ సార్జా, శరత్ కుమార్ లతో రిలేషన్ ఉందని జోరుగా ప్రచారాలు సాగాయి. అయితే అది కేవలం రిలేషన్ విత్ బెనిఫిట్స్ అనే విధంగానే సాగిందని చెబుతున్నారు. వీళ్లే కాకుండా ఇంకో ఇద్దరు కూడా కిరణ్ రాథోడ్ తో డేట్ చేసిన వారితో కూడా ఈ అమ్మడు సరిగ్గాఉండలేకపోయింది. ఈ క్రమంలో మద్యానికి బాగా అలవాటైందని అంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ షోతో మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాలని అనుకుంటుంది.