Rasi Phalalu: మార్చి17, సోమవారం.. నేటి మీరాశి ఫలాలు! వారికి జీతభత్యాలు పెరిగే అవకాశం, రహస్య శతృబాధలు

Rasi Phalalu, Horoscope |
జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నుంచి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం ఈ రోజు (సోమవారం, మార్చి17) న వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (Aries) :
జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో విశేషలాభాలు. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు. అంతటా సుఖమే లభిస్తుంది. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. ఆకస్మిక ధనలాభం. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం. బంధు, మిత్రుల సహాయ సహకారాలు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు కొంటారు.
వృషభం (Taurus) :
ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం. ఆకస్మిక ధననష్టం అవకాశం. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు. కుటుంబంలో శుభ పరిణామాలు. సన్నిహితులతో విరోధం అవకాశం.
మిథునం (Gemini) :
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల కొన్ని కార్యాలు విఫలం. చెడు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు, జీతభత్యాలు పెరిగే అవకాశం.
కర్కాటకం (Cancer) :
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు. ఆస్తి వివాదం పరిష్కారం. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు. ఆకస్మిక కలహాలకు అవకాశం. ధన నష్టం ఉంటుంది. అధిక రుణప్రయత్నాలు చేస్తారు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. సంతోషంగా కుటుంబ జీవితం.
సింహం (Leo) :
వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి. ఉత్సాహంగా కుటుంబ జీవితం. బంధు, మిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం. అనారోగ్య సమస్యలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం.
కన్య (Virgo) :
లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నకార్యాల్లో సఫలం కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ప్రాధాన్యం. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ప్రశాంతంగా కుటుంబ జీవితం. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు.
తుల (Libra) :
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు. ఆకస్మిక ధననష్టం అవకాశం. ఉద్యోగంలో ఆదరణ. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఉండవు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం ఉత్తమం. విలాస జీవితంపై ఎక్కువ ఖర్చు చేస్తారు. ఒకటి రెండు అదృష్ట యోగాలు ఉన్నాయి.
వృశ్చికం (Scorpio) :
అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఆకస్మిక భయాందోళనలు పోతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. రుణప్రయత్నాలు ఆలస్యం. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం. బంధు, మిత్రులతో వైరం అవకాశం. రహస్య శతృబాధలు ఉంటాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.
ధనుస్సు (Sagittarius) :
ఆస్తిపాస్తుల సమస్యలకు పరిష్కారం. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. వ్యాపారాల్లో కష్ట నష్టాలు తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి. ఒత్తిళ్లు, శ్రమలు తగ్గి మానసిక ప్రశాంతత ఉంటుంది.
మకరం (Capricorn) :
వ్యాపారాలు లాభసాటి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఉన్నా ఫలితం ఉంటుంది. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. విద్యార్థులు చదువుల్లో పురోగతి. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుంభం (Aquarius) :
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఊహించని పురోగతి. మనోల్లాసం పొందుతారు. సోదరులతో వైరం అవకాశం. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగుతాయి.కుటుంబంలో కొన్ని చికాకులు. కొత్త వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి.
మీనం (Pisces) :
ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, లావాదేవీలు పెరుగుతాయి. పిల్లల విషయంలో పట్టుదలగా ఉండకూడదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు. చెడు పనులకు దూరంగా ఉండాలి. ప్రయాణాల వల్ల లాభాలు. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. కొత్త పనులకు దేరంగా ఉండాలి. సాఫీగా ఉద్యోగ జీవితం. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం.