జలసౌధలో కృష్ణా,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ ప్రారంభం
విధాత,హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ప్రారంభమైంది. కేఆర్ఎంబీ(కృష్ణా బోర్డు), జీఆర్ఎంబీ (గోదావరి బోర్డు) ఛైర్మన్ల నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ, ఇంజినీర్లు హాజరయ్యారు.రెండు బోర్డుల సమావేశానికీ తెలంగాణ సభ్యులు గైర్హజరయ్యారు. భేటీకి హాజరుకాలేమని బోర్డులకు ఇప్పటికే తెలంగాణ లేఖలు రాసింది. లేఖల ప్రతులను బోర్డు ఛైర్మన్లకు ఈ ఉదయం అధికారులు […]

విధాత,హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం ప్రారంభమైంది. కేఆర్ఎంబీ(కృష్ణా బోర్డు), జీఆర్ఎంబీ (గోదావరి బోర్డు) ఛైర్మన్ల నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ, ఇంజినీర్లు హాజరయ్యారు.రెండు బోర్డుల సమావేశానికీ తెలంగాణ సభ్యులు గైర్హజరయ్యారు. భేటీకి హాజరుకాలేమని బోర్డులకు ఇప్పటికే తెలంగాణ లేఖలు రాసింది. లేఖల ప్రతులను బోర్డు ఛైర్మన్లకు ఈ ఉదయం అధికారులు అందజేశారు. సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చిస్తున్నారు.