సోమశిల ప్రాజెక్టుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ‘ప్రత్యేక’ దృష్టి

ప్రాజెక్టు పనులను పరుగులెత్తించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఆధ్వరంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఆదేశం విధాత:సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 1, భూసేకరణ,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల గురించి జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులను ఆరా తీసిన మంత్రి మేకపాటి భూసేకరణ సమస్యను త్వరగా పరిష్కరించాలని సోమశిల ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావుకి ఆదేశం.సోమశిల హెచ్ఎల్సీ ఫేజ్ 2 భూ సేకరణపైనా సర్వే చేయించాలని స్పెషల్ కలెక్టర్ కు ఆదేశం.సోమశిల […]

సోమశిల ప్రాజెక్టుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ‘ప్రత్యేక’ దృష్టి

ప్రాజెక్టు పనులను పరుగులెత్తించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్

జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఆధ్వరంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఆదేశం

విధాత:సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 1, భూసేకరణ,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల గురించి జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులను ఆరా తీసిన మంత్రి మేకపాటి భూసేకరణ సమస్యను త్వరగా పరిష్కరించాలని సోమశిల ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావుకి ఆదేశం.సోమశిల హెచ్ఎల్సీ ఫేజ్ 2 భూ సేకరణపైనా సర్వే చేయించాలని స్పెషల్ కలెక్టర్ కు ఆదేశం.సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన వరికుంటపాడు, దుత్తలూరు, సీతారామపురం మండలాల పరిధిలో గుర్తించిన 1016 హెక్టార్లను అటవీ శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ అధికారుల మ్యుటేషన్ పై కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి

హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు, కాంట్రాక్ట్ ల ఆలస్యంపై మంత్రి అసంతృప్తి.జూన్ 10 కల్లా గుత్తేదారులు పనులు మొదలు పెట్టకపోతే చివరిగా నోటీసులు పంపాలని మంత్రి ఆదేశం.మంత్రి మేకపాటి కార్యాలయంలో సోమశిల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి.సోమశిల ప్రాజెక్టు పరిధిలోని కాలువల అభివృద్ధి పనుల వేగం పెంచేందుకు ఆదేశాలు.రూ.117 కోట్ల విలువైన సోమశిల ప్రాజెక్టు మరమ్మతుల పనులు, సోమశిల ప్రాజెక్టు పరిధిలోని కాలువల అభివృద్ధి పనుల వేగం పెంచేందుకు ఆదేశాలు

చాబోలు రిజర్వాయర్ పనులనూ వేగం పెంచాలి

ఉత్తర కాలువ పనుల విస్తరణ, పనుల వేగంవంతానికి ఆదేశం..ఉత్తర కాలువ మీద 10వేల ఎకరాలకు రూ.50కోట్లతో లిఫ్ట్ లను పూర్తిచేయాలన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.అటవీ, రెవెన్యూ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అనంతరం జాబితా సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ కు మంత్రి మేకపాటి ఆదేశం.సోమశిల ప్రాజెక్టుపై సమీక్షలో ఎస్.ఈ కృష్ణారావు, తెలుగుగంగ సీ.ఈ హరనాథ్ రెడ్డి, సోమశిల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటరమణారెడ్డి, సురేష్ తదితరులు.