బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.05, డీజిల్ రూ.82.61కు చేరింది. దేశ రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.36, డీజిల్ రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.87.45, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.95.67, డీజిల్ రూ.90.06, రాజస్థాన్ జైపూర్‌లో పెట్రోల్ రూ.99.31, […]

చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.05, డీజిల్ రూ.82.61కు చేరింది. దేశ రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.36, డీజిల్ రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.87.45, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.95.67, డీజిల్ రూ.90.06, రాజస్థాన్ జైపూర్‌లో పెట్రోల్ రూ.99.31, డీజిల్ రూ.91.98, భోపాల్‌లో పెట్రోల్ రూ.100.08, డీజిల్ రూ.90.05కు చేరాయి.
ఈ నెలలో చమురు ధరలు పెరుగడం ఇది ఏడోసారి.
తాజా పెరుగుదలతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరాయి.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటింది.కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 18 రోజుల పాటు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచలేదు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పెంచుతూ వస్తున్నాయి.