OTT విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర ఉండనుంది. తెలుగులో 7, హిందీలో డజన్ చిత్రాలకు పైగా విడుదల కానున్నాయి. అందులో ప్రముఖమైనవి మూడు నాలుగు మాత్రమే. వీటిలో ప్రధానంగా ఇటీవల మళయాళంలో విడుదలై 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 2018 సినిమా తెలుగులో విడుదల కానుంది. వీటితో పాటు నిత్యం వార్తల్లో ఉండే సీనియన్ నరేశ్ ,పవిత్రా లోకేశ్ నటించిన మళ్లీ పెళ్లి, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న […]
OTT
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర ఉండనుంది. తెలుగులో 7, హిందీలో డజన్ చిత్రాలకు పైగా విడుదల కానున్నాయి. అందులో ప్రముఖమైనవి మూడు నాలుగు మాత్రమే. వీటిలో ప్రధానంగా ఇటీవల మళయాళంలో విడుదలై 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 2018 సినిమా తెలుగులో విడుదల కానుంది. వీటితో పాటు నిత్యం వార్తల్లో ఉండే సీనియన్ నరేశ్ ,పవిత్రా లోకేశ్ నటించిన మళ్లీ పెళ్లి, తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మేం ఫేమస్ ముఖ్యమైనవి.
ఇక ఓటీటీల్లో రెంట్ పద్దతిలో పొన్నియన్ సెల్వన్2 రానుండగా, విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, మేఘా అకాశ్, నివేథా నేతురాజ్ కలిసి నటించిన భూ డైరెక్ట్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు సత్తిగాని రెండెకరాలు వంటి సినిమాలు, వెబ్ సీరిస్‌లు తక్కువగా విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
Hindi
Sathi Gaani Rendu Ekaralu May 26
Bloody Daddy Hindi June 9