SSMB29: మహేశ్‌బాబు, రాజమౌళి సినిమాలో జాన్ అబ్రహం.. అంతా ఫేక్ న్యూసే

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Raja Mouli) కాంబినేషన్లో ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయమై ఇప్పటికే హైద్రాబాద్‌కు వచ్చి టెస్ట్ షూట్ కూడా పూర్తి చేసిన ప్రియాంక హైదరాబాద్ సమీపంలోని ప్రముఖ ఆలయాలను సైతం దర్శించుకుంది. ఆపై మూవీ ప్రధాన యూనిట్‌తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అయితే.. ఇప్పటికే ఈ సినిమాలో మన దేశంలోని పేరున్న నటీనటులతో పాటు విదేశీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇండోనేషియా బ్యూటీ హీరోయిన్గా నటిస్తున్నట్లు న్యూస్ కూడా వైరల్ అయింది. కానీ అందుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కాగా ఇటీవల ప్రియాంకా చోప్రాతో పాటు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్ర చేస్తున్నట్లు న్యూస్ బాగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ తప్పుకున్నాడని ఆయన స్థానంలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటిస్తున్నట్లు రెండు రోజుల నుంచి అన్ని మీడియాల్లో ఒక్కటే ఊదరగొడుతున్నారు.
దీంతో ఈ విషయం కాస్త మేకర్స్ వరకు వెళ్లడంతో వారు ఈ వార్తలపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ మూవీ కోసం రాజమౌళి గానీ ఇతర టెక్నీషియన్స్ గానీ జాన్ అబ్రహం(John Abraham)ను సంప్రదించలేదని అవన్నీ వాస్తవాలని నిర్మాత కేఎల్ నారాయణ (KL Narayana) చెప్పినట్లు వినికిడి. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, వెబ్సైట్లు అత్యుత్సాహంతో లేని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ అడవుల్లో జరుగుతోంది.