ఆ అమ్మాయితో.. ప్రభాస్ పెళ్లి? రామ్ చరణ్ హింట్! ఈసారైనా నిజమయ్యేనా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే ఈ సారి సినిమాతో కాదు ఎప్పటిలానే తన పెళ్లి వార్తతో ఇప్పుడు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యాడు. ఐదారేండ్లుగా ఇలాంటి వార్తలు చాలానే వచ్చినా అవన్నీ పుకార్లలానే ఉండిపోయాయి. ఇసారి అలాంటి వార్తలే వచ్చిన ఓ షో నుంచి రావడంతో ఇప్పుడు ఈ ప్రభాస్ పెళ్లి న్యూస్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘బాహుబలి’ హీరో ప్రభాస్. ప్రభాస్ పెళ్లి గురించి ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎవరిని వివాహమాడతారు? అని మాట్లాడుకున్న సందర్భాలు కోకొల్లలు, ఆయన వివాహమాడబోయే అమ్మాయి ఈమే నంటూ ఇప్పటికే ఎన్నో ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లిని ఉద్దేశించి ఆయన స్నేహితుడు, నటుడు రామ్ చరణ్ (Ramcharan) ఆసక్తికర విషయాన్ని బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా రామ్‌చరణ్ తన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా సెలబ్రిటీ టాక్ షో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable)షోకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) ప్రభాస్‌కు ఫోన్ చేసి కాసేపు రామ్‌చరణ్‌ను ఆట పట్టించారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ఎవరిని పెళ్లాడనున్నారనే విషయాన్ని రామ్‌చరణ్ ఈ కార్యక్రమంలో చెప్పినట్లు సమాచారం. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా చరణ్ నవ్వుతూ… ఆంధ్రప్రశ్ గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నాడని చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. అయితే ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ అమ్మాయి ఎవరా అంటూ ఆరా తీస్తున్నారు. అయితే గతంలోనూ ఈవార్త బాగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ సాధికారత లేదు.